Friday, May 20, 2022

సుబ్రమణ్యం

 సుభ్రమణ్యం అనగా నేమి?  మన భృకుటి మధ్యమున ఆరుముఖములు గలిగి పరిభ్రమించుచున్న ఒక మణి ప్రకాశమును పొంది యున్నది. ఈ జ్యోతి మణినే షణ్ముఖ మణి అని పెద్దలు పేర్కొనిరి. మన మూలాధార చక్రమునకు  పైన మూడు స్థానములు విడిచి విశుద్ధమయిన హృదయస్థానమంధలి ఎడమ భాగమున ఆరు తలలను కలిగిన ఒక నాడి వున్నది. దీనినే సుభ్రమణ్యం అని చెప్పుదురు. ఈ దేహమునందలి ఆరు జ్ణానముల కలయిక అయిన శుద్ద వివేకము అనబడు జ్ణానమును కూడా షణ్ముఖమ్ అని అందురు. ఆరు ఆధారములలోని ఆరు ప్రకాశములను షణ్ముఖం అందురు . ఏది ఏమైనప్పటికి సర్వతత్వముల అంతములోశాంతితో నిండిన ఆరు తలలు గల శుద్ద ఆత్మ జ్ణాణముతో నిండిన చిత్తమే సుభ్రమణ్యం . ఆరు జ్యోతులను కలిగి ,ఆరు జ్ణానములతో ఆరు తలలు కలిగి ఉండటము వలన ముఖములు ఆరు ,పాదములు రెండుగా అనగా ఉద్బ వించు జ్ణానము (మానసిక జ్ఞానము)  మరియు ఉద్బవింపచేయు జ్ఞానము(ఆత్మజ్ఞానము) అనగ విషయ జ్ఞానము మరియు నిర్విషయ జ్ఞానము . చేతులు పన్నెండు  ఆరు ఆధారములలోని ప్రకాశ అప్రకాశ స్థితి. 

పది ఆయుధము , అభయ వరదం అనునవి

1.వజ్రం- తీక్ష్ణ భావము,

2 శూలం- శక్తిని ,జ్ఞానమును,అనుగ్రహమును,

3 మణి- ఆత్మ స్వరూపమయిన నాధమును , 

4 ధ్వజం- కీర్తి ని ,

5 సరసిజం- దయను,

6 కుక్కుటం- మత్సర్యములేని పూర్ణత్వమును ,

7 పరాగమ్- బంధవిముక్తిని,

8 దండం- వైరాగ్యమును ,

9 బాణం- ఆప్యాయతను,

10 అభయం- క్షమాగుణమును,

11 వరధం- సహనమును,

12 కధాంబమాల- సర్వతత్వ ఖండ నమును,

            పలువర్ణములను కలిగి ఉన్నది, విచిత్ర రూపము కలిగి ఉన్నది, మతిమరుపులంటి గుణములకు కారణమైనది, మాయకు స్థానమై ఉన్న మూల ప్రకృతియే మయూరమ్ .మయూర వాహనము పై స్వామి అధిరోహించియుండుట అనునది ఏమనగా : పిండాణ్డ స్వరూపమైన ఈ  దేహము నందు మరియు అండమునందు మూల జ్ఞాన కారణమైన ప్రకృతి మాయా యొక్క అశుద్ద కేవలమయిన అశుద్దా శుద్ద మహా అహంకారము అనే రాక్షస అంశమైన  శూరతత్వమును, అందులోనుండి వెలువడిన మూడు రకములైన తత్వములతో అజ్ఞాన మార్గములో లో ఆత్మజ్ఞానమును, పిండ ప్రతిరూపములైన దేవతలను, విషయ ప్రతిరూపములైన ఇంద్రియములను, నాడి ప్రతిరూపములైన యంత్రములను,ప్రాణప్రతిరూపములైన జీవులను హరించి స్వ పరిపాలన చేయును.అట్టి శూర తత్వమును అంతమొందించునపుడు పైన చెప్పబడిన తత్వము మహామాయ అయిన మామిడి వృక్షమై మాత్సర్యమునకు ప్రతిరూపమయిన కుక్కుటముగాను విచిత్ర మాయ అయిన నెమలిగాను,మహా మదము గల గజముకఖుడుగాను అతిక్రోధమైన సింహముఖముగాను ప్రతిబింబించును.

సర్వతత్వములను తన వశము చేసుకొని అహంకారము అనే ధ్వజమును ఎగురవేసి అజ్ఞాన నాటక మాడే తత్వ అహంకారమును అణచి పతి పశు పాశం అనాది నిత్యం అనే సిద్ధాంతమును  విశదీకరించి చూపుటకు  మాత్సర్య కుక్కుటమును బోదమను చేతితో అణచి విచిత్ర మాయ అయిన నెమలిని తన కాళ్ళ క్రింధ వుంచి తాను పైన అధిరోహించి దాని గర్వమును అణచి జుగుప్సాకర మాయాతత్వములను సంహరించి శుద్ద విషయ భువనమైన దేవ లోకమును  నిలకడగా వుండునట్లు చేసి ,ఇంధ్రుని కుమార్తె అయిన తాంత్ర తత్వమనే దేవాయనై అమ్మవారిని తన ఎడమ వైపు వుంచి ఇంద్రియములయిన  వేటగాళ్లచే పెంచ బడిన మానసము అనే లేడి గర్భమున జన్మించిన వల్లి అనే పరిశుద్ద మనసుగల అమ్మవారిని తన కుడి భాగమున వుంచి , నవ తత్వ కారణమైన నవ వైరాగ్య తత్వమైన  వీరులను సమీపమున  వుంచి ,సకల జీవరాసులకు స్మృతి మరియు స్మృతిబ్రంసమునకు మధ్య వివేకా రూపమైనట్టియూ,పాదము నుండి నాభి వరకు ఉష్ణరూపమై ,నాభి నుండి కంఠము వరకు ఆధార నాడీ రూపమై, కంఠము నుండి భృకుటిమధ్యము వరకు మణిరూపమై,శిరస్సునంధు కాంతిరూపమై ,బుద్ధి యంధు పరిశుద్ధ జ్ఞానమై అనుభవములో నిత్యమై,సర్వము సంపూర్ణమై,కోణములు ఆరై ,ఏ కాలములోను మతములు ఆరై, స్వరవేదాంత సిద్దాంతములలో ఆరుగాను,వర్ణములలో ఆరుగాను,వెలయు నిజమైన దేవుడే సుబ్రమణ్యం .

ఏక  ముఖం ,ద్వి ముఖం ,త్రిముఖం, చతుర్ ముఖం ,షణ్ముఖం  అని  వెలయుటకు గల కారణము ఏమి 

ఏకముఖం:   అసమానమైన  పరబ్రమ్హ స్వరూపము జీవులకు అనుగ్రహించు నిమిత్తమై మన భావమునకు ఏకమై పరమాకాశమునంధలీ జ్ఞాన స్వరూపముగా ఎంచి ఏక ముఖముతో పూజింపబడుచున్నాడు అని జ్ఞానులు  పేర్కొనేధరు.

మూడు ముఖములు శుద్ధ సాత్వికం ,శుద్ద రాజసం,మరియు శుద్ద తామసం  ను సూచించును.

నాల్గు ముఖములు  అనగా  పశు మనస్సు అనగా జీవం యొక్క మనస్సును,శుద్ద మనస్సును,అంతఃర్ముఖము ,సంకలిత మనస్సు అయిన  బుద్ధి,చిత్తము,మరియు అహంకారము అను తత్వముల యొక్క కలయిక.

ఆరు ముఖములు  పంచేన్ద్రియ జ్ఞానము మరియు ఆత్మ జ్ఞానమును  అను తత్వముల యొక్క కలయికయొక్క  మూలకారణమైన ప్రకాశమే ఆరుముగమ్.

మయూరము తన పాధము క్రింధను,నోటియంధును సర్పము దేనిని సూచిస్తుంధి ?.విచిత్ర మాయా రూపమయిన అంధకార రూపమయిన  అహంకారము పుట్టి విశ్వమంతా వ్యాపించు తరుణము ములాంకురమయినటువంటి మూలప్రకృతి స్వరూపమయిన పరమాత్మనుండి వెలువడి వ్యాపించు ప్రాణవాయువు యొక్క వేగమును ఆటంక పరచు విధముగా  పై ప్రకృతి  మాయ అను అహంకార ద్వారమైన నెమలి నోటి ద్వారా ప్రకృతి ప్రాణ వాయువు యొక్కఉచ్వాస నిశ్వాసల యొక్క  వేగమును  తగ్గించుచున్నది. (మాయా రూపముగా నెమలిని, అహంకార ద్వారముగ నెమలి యొక్క  ముఖమును ,నెమలి  ముఖమునందు గల సర్పము పిండము నందలి   ప్రాణ వాయువు యొక్క ఉచ్వాస నిశ్వాసలను సూచించు విధముగా వర్ణించబడి ఉన్నది. .నెమలి నోటియందుగల సర్పము పిండము యొక్క  ప్రాణ వాయువు యొక్క ఉచ్వాస నిశ్వాసలను సూచించునదిగా వున్నది) 

పడైవీడు అనగానేమీ ?స్వామి కొలువైవున్న స్థలములు అవి  ఆరుపడై అని చెప్పబడి వున్నది.ఆ ముఖ్యమైన ఆరు స్థలములు .

1.తిరువేరగం(స్వామి మాలై ) : అందమైన మరియు జ్ఞానముతోకూడిన స్థలము.

2. తీరు ఆవినన్కుడి (పళని):  ‘తీరు’ అనగా లక్షీకరమైన సంతోషము, ‘ఆ’ అనిన పశు అనబడు జీవుడు ‘ఇనన్’ అనగ సూర్యుడు అనబడు బుద్ధి .ఈ మూడు కలిసియున్న ప్రదేశము అనగా ఆత్మ జ్ఞానము యొక్క శుద్ధ కార్య స్థలము.

3. ఫల ముధీర్ సోలై (అలగర్ మలై):  ఇన్ద్రియములు , అంతఃకరణములు ,  ఆత్మ  మొదలగు వాటి అనుభవ ఫలమైన సంతోషమునుండి  విముక్తి చెంది నిర్మలమైన జ్నానమును ప్రసాదించు స్థలము.

4. తిరుచ్చీరలైవాయ్ (తిరుచ్చెంధూర్ ,జయంతిపురం): పరిశుద్దమైన  మనస్సు యొక్క ముఖద్వారము ప్రాపంచిక విషయ సాగరమునంధు కోరిక అనే అలలు ఎగసిపడే స్థలమైన సముధ్ర తీరము వలే, అలజడితో వుండునటువంటి మానవుల హృధయ స్థానమైన మనస్సు అజ్ఞా నమనే అసురుడిని నివర్తించి సంతోషమును పొంధి పది మనస్సు అనగా పరమాత్మగా వెలసిన స్థలము.

5 తిరుప్పారకున్ద్రమ్ : చలనములేని ఒక అంశము యొక్క పరమార్థమై వున్న వివేకా వుల్లాస  సంతోషములతో పరిపూర్ణముగా నిండివున్న స్థలము కుండృ అనగా కొండ.

6.కుండృతోరాడల్ (తిరుత్తణి) : పర్వతములే నిలయమై వున్నవాడు.

శిఖరము అనునది నిశ్చలమైన స్థితికి మొదటి కారణమైన తుర్యము అను స్థితి ఈ తుర్యము పరతుర్యము శుద్ధతుర్యము,గురుతుర్యము,శివతుర్యము,శక్తి తుర్యము, మొదలగు తుర్య శిఖరములు అనుభవములో అనంతముగా వుండును.

పైన పేర్కొన్న అనుభవములు దేహమునందు స్థానములు ఏవి అనగా జనానాంగములు,నాభికి క్రింధి భాగము,నాభి,నాభికి పై భాగము,ఉరస్సునంధు రొమ్ముభాగమునకు క్రింధి భాగము,రొమ్ము ప్రదేశము మోదలగునవి.

బ్రహ్మను చెరయంధు బంధించినది : శుద్ధ మనో సంకల్ప సృష్టి గావించు బ్రహ్మము అనే మనస్సును క్రియ యంధు ప్రవేశించకుండా చేయడానికి శుద్ద ప్రకాశ వివేకముతో నిండియున్న సుబ్రమణ్య తత్వముతో సర్వపిండ విషయములైన సృష్టి ,స్థితి ,లయము,తిరోదానము, అనుగ్రహము మొదలగు పంచకృత్యములు వివేకముతో తన ఆద్వర్యములో చేయటానికి ఎట్టి అలసత్వము లేక బంధించి వుంచుటయే చెరసాలయంధు వుంచినదాని అర్థము.

ఈశ్వరునికి ఉపదేశించినది ఏమి అనగా ? రుధ్రతత్వమైన ప్రేరక స్థితి అయిన కారణ తత్వము యొక్క అంతమైన ఈశ్వరతత్వము యొక్క సహజ జ్ఞానము ప్రకోపించి క్రియాశక్తి తగ్గటం వలన ,క్రియా కారణ భూతమై, జ్ఞాన కారణ అంశమై వెలసిన ప్రణవమైన సత్యముతో నిండి వున్న క్రియాహీన నిర్విష య అనుభవము ఈశ్వర తత్వమునకు న్యాయము చేయును.శుద్ద వివేక తత్వమునకు అధిస్టాన దేవత అయిన సుబ్రమణ్యం లేక వుధ్భవించదు.దీనినే సుబ్రమణ్యస్వామి శివునికి వుపదేశించారని చెప్పేదారు.

గంగనదీ తీరమున రెల్లుగడ్డి పోధలలో  జన్మించడం ఏమిటి?ఆత్మ సహజ గుణమైన దయను సూచించునది గంగా.ఆత్మ యొక్క అనుభవ మధ్యంతర స్థితి అయిన సహనగుణము సర్వవిషయము లందు అహంకారము తలెత్తకుండా అణకువను కలిగివుండటమును రెళ్లు గడ్డి సూచించును.ఈ రెండింటి మద్య అనగా దయ సహనము అనుభవమునకు సహజ సిద్దముగ  తెలియు విచక్షణా జ్ఞాన మయిన వివేకము అనే జ్ఞానము కలుగుటయే సుబ్రమణ్యస్వామి జననము.

మరి కార్తీక స్త్రీలు పాలు ఇవ్వడము అనగా వివేకము ఉద్భవించునపుడు మాతృశ్రీ యొక్క రూపమయిన శ్యామల అను శక్తి స్వరూపము వెలువడి ఆనంధము అను అమృత కిరణమును వివేకమునందు పొందు పరచుటయే పాలు ఇవ్వడం.

స్వామి అమ్మ దగ్గర శిశువును ఇవ్వగా అమ్మ ఆరు శిశువులను ఏకము చేసి చేతితో నిమరగా ఆరు ముఖములు కలిగి దేహము ఒకటిగాను, కాళ్ళు రెండుగాను,చేతులు పన్నెండుగాను ఉన్డి ప్రకాశించు చున్నది ఏమి అనిన పరమాత్మ అయిన స్వామి అనుగ్రహము అను శక్తి తో దయ అనే నదీ తీరమున సహనము అను రెల్లుగడ్డిపొదలో ఆది కాలమున ఉద్భవించినపుడు శుద్ద విషయ వాసనా వికాసముతో ఆరు నిప్పు రవ్వలుగా శిశువులను అనుగ్రహ దేవతకు ప్రసాదించగా కృపా శక్తి ఎటువంటి వికారములు లేక ఆరు నిప్పు రవ్వలను  జ్ఞానానుగ్రహ హస్తముల ద్వారా దగ్గరకు చేర్చగ విషయవస్థలలో మునగక పిండమునకు ఎట్టి నష్టము లేక ఆరు నిప్పు రవ్వలు తమ ఉనికి మరియు బింబము మారకుండా ఆరుతలలతో ఒక దేహమై అనుభవము మరియు సాధనా శక్తితో సంకల్ప స్థితిలో వెలయుచు సమాధి స్థితి లో ఉన్డుటయే.

పిండమునందు ఈ విధముగా వుండగా అండమునందు వీటికి ఊరు, ఆలయము, మూర్తి, పూజలు, మొదలగునవి ఏర్పరచి యున్నది ఎందుకనగా ఆత్మలు పాప పుణ్య కర్మల ద్వారా విభేదించబడి మందం, మందరం, రాజసం, తామసం, కర్మం మొదలగు బేదముల చే ప్రారంబమై ఇప్పటివరకు జీవరాసులు ఒక్కటే అయినప్పటికి కరణ సంయోగము ద్వారా వేరు వేరు విధములుగా పుట్టి జీవించు చున్నది.అంధువలన మహా కరుణ గల కృపా నిది అయిన ఈశ్వరుని కృప అరచేతిలో వెన్న అని తెలుసుకొని అనాది నిత్యముక్తి సిద్దుడైన ఈశ్వర తత్వ భువనానుభవ ఈశ్వరుని చే మనము అనగా జీవులు ముక్తి పొందు నిమిత్తమై ఈ లోకమున పశు , పతి, పాశం మరియు అనుభవములను తెలుపుటకు వరుసగ పురాణం,వేదం,ఆగమం,ఉపనిషత్తులు,ఆవిష్కరించబడినవి.వాటిద్వారా కర్మఖాన్డం భక్తి ఖాండమ్,ఉపాసనా ఖాండమ్,తంత్రకల, మంత్ర కల, ఉపదేశ కల మొదలగుబెదములు , వీటికి ముఖ్యమైన ఆచారం, వర్ణం, ఆశ్రమం, మొదలగు వాటిని , వాటికి హేతువైన సరియగు నాలుగు చర్య లు , క్రియ, యోగం , జ్ఞానం వీటికి తోడుగా సాలోక్యది నాలుగును( సాలోకం ,సామీప్యం సారూపం,సాయుజ్యం ) వీటికి మార్గమైన తత్వము, భువనము, పరమపదము, వర్ణం, మంత్రం, కళలు, మొదలగునవి నిర్ణయించి, పాపనాశనమునకు హేతువైన అనసన,చాన్ద్రాయణ మొదలగు ప్రా యశ్చిత్తములను,విధించి, వీటిని అనుసరించుటకు యోగ్యమైన నదులు మొదలగు వాటికి అంగములైన తత్వానుభవములైన, నిజమైన నామములు, చెడకుండా ఉండుటకు పవిత్ర నామములు మూర్తి స్థలము మొదలగు వాటిని భగవంతుని సేవ చేయుట కొరకు  ఏర్పాటు చేసి ఉన్నారు.

ఉపాసకులకు తత్వ నామం చెడకుండా కృపా శక్తి యొక్క జ్ఞానము తెలియుటకు కృత్తికనూ,వేదాంత వివరణకు విశాఖమునూ ,ఎల్లప్పుడు శుభము కలుగుటకు మంగళ వారమును, ఆరు జ్యోతులను సూచించుటకు షష్టిని, జ్ఞాన పరిపూర్ణత్వమును తెలుపుటకు తైప్పూసమును పేర్కొని నిర్ణయించియున్నరు.

తత్వములను చేతబుని నాట్యము చేయుచు జ్ఞానము అను చేతితో విషయ ఫలమును తత్వమనే కావడిలో కట్టి తన భుజములపై వుంచి తాను అను అహంభావము నశించి తన్ను తాను ఆ పరమాత్మ స్వరూపుడుగ ఎంచి జ్ఞాన స్వరూపుడై తీవ్ర సంకల్పుడై సుబ్రమణ్య తత్వమై ఆ మూర్తి ముందర విషయాభావ న్యాయమే కావడి.శుద్ద వైరాగ్య నిశ్చల శివ జ్ఞానమే హిడింబా అను రాక్షసునిగా చెప్పబడి యున్నది.

హృదయాకాశ షట్కోన రూపమే యంత్రమై దాని  భాగ విభాగములే 40 ముక్కోణములై ఉపంఘమే  నవ ఖండములై సత్యమే “శ” కరమై, విషయ త్యాగమే “ర” కరమై ,నిత్య తృప్తియే “వ” కరమై నిర్విషయమే “ణ” కరమై పాప నివృత్తి హేతువే “భ” కరమై ఆత్మ ప్రకృతి గుణమే “వ” కరమై వెలయుటయే షడక్షర మంత్రమైనది. (శరవనభవ).

మన శరీర హృదయ స్థానమే ఆలయమై మాయా విచిత్రమే నెమలియై, నాభి అంతమే భలీ పీటమై, కొండ నాలుక యొక్క మూలమే ధ్వజస్థంభమై, పంచ కోశములు ప్రాకారములై ,త్రిగుణములు బిల్వ వృక్షమై, ఆత్మ దయనే తటాకమై, ముఖము మహాద్వారమై , అనుభవ జ్ఞానమే గోపురముగా విధించ బడి యున్నది.

జ్ఞానులు భగవంతుని ఎచ్చోటనైనను, యోగులు హృదయమునందు ,ఖర్మకాండులు అగ్ని ద్వారా  సాధారణ భక్తులు విగ్రహము ద్వారా ఉపాసన చేయుదురు .దానికి అనుగుణముగా తత్వ విచారమును ఆలయములుగా మలచినారు.ఆలయములోని మూర్తి వద్దకు బందములతో ముడిపడి ఉన్న ఆత్మలను శివ పాశముతో బంధించి పశు పాశము ద్వారా పైన చెప్పబడిన రీతిలో తంత్ర మంత్ర కళలను గురువు యొక్క ఉపదేశ మార్గము ద్వారా వివరించి పై ఉపాసనా మార్గముల ద్వారా భక్తులను ఆశీర్వదించి ఖాండత్రియములో నిలకడ చేసి జ్ఞానము నిచ్చి అనుభవ సూక్తితో సమాదియోగమును తెలిపివున్నారు.వీటిని జీవులు మరువకుండా వుండు నిమిత్తమై జింకను చూపి జింకను పట్టు విధముగా ఆలయమునందలి మూర్తి అయిన సుబ్రమణ్య స్వామిని తత్వరూపమున వివరించి ,అర్చకుడు మరియు ఆచార్యుడు జ్ఞానము అను కర్పూరమునన్దు సుబ్రమణ్యం అను సత్యమును , దీపమందలీ ప్రకాశముచూపి అశుద్ధ విషయములు మన చెవిలో పడకుంట ఉండుటకు నాధము అను గంటను మ్రోగించి ఆ శబ్ధము ద్వారా  దేవుని దర్శింప జేసి వేరు విషయములపై మనస్సు మరలక తథ్రూపముగా భక్తులు నిలపడీ ప్రార్థించగా వారి వారి భక్తి ప్రవృత్తుల మేరకు తత్ఫలితములను  ప్రసాధించుటకు అన్న ప్రసాద వినియోగము చేయుటయే తగిన మార్గమని సిద్ధాంతముని ఏర్పరిచినారు.  ఈ విధముగా అనాధి నుండి ఇప్పటివరకు అరున-ణగిరినాధ,ర్ కుమార గురుభరర్, నత్కీరర్ మొదలగు మహానుభావులు సేవలుచేసి ఉత్తమ జ్ఞానులై నిత్యముక్తులై  వెలసిఉన్నారు.  కావున మనమందరమూ ఆ నిజమైన దేవుడిని వేదాగమ విధులతో నిజమైన భక్తి తో స్తుతించి స్వామి అనుగ్రహము పొందవలయును.



                                                                 సమాప్తం