Friday, December 24, 2021

జీవకారుణ్యం - దివ్యత్వం

 

❤ జీవకారుణ్యం అంటే ఇతర జీవుల మీద మనం చూపించే ప్రేమ, దయ, కరుణ. ❤️


❤️ జీవకారుణ్యం అంటే ఆ జీవులు కష్టాలలో, బాధలో ఉన్నప్పుడు వారి కష్టాలను తొలగించి, వారి బాధలను నివారించడం. ❤️


వళ్లలార్ వాక్కు, " జీవకారుణ్యమే మోక్షానికి మార్గము "


ఇది ఎలా సాధ్యం?


ఎన్నో యోగములు, తపస్సులు చేసినా కూడా దుర్లభమైన మోక్షము జీవకారుణ్యం ద్వారా ఎలా సాధ్యమవుతుంది?


అసలు మోక్షమంటే ఏంటి?


మోక్షం అనేది సిద్ధి పొందుటకు ముందు ఉన్న సాధనం అని అంటారు వళ్ళలార్. ఇక్కడ సిద్ధి అంటే అమరత్వ సిద్ధి, దివ్యత్వ సిద్ధి.

మరి మోక్షానికి, సిద్ధికి ఉన్న తేడా ఏంటి?


మొక్షమనేది మన ప్రాణాన్ని మరణానికి వదిలేయకుండా, మన వశం లోనే ఉంచుకొని, ఆ పరమాత్మలో అంతర్లీనమై పోవడం. ఆత్మ ప్రయాణం లో ఇదే ఆఖరి ఘట్టం అని అనుకుంటున్నాం. కానీ వళ్ళలార్ దీనిని కూడా ఒక సాధనగానే పరిగణిస్తారు.



ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే చేరుకోవడం అనేది కాదు. మనం ఎందుకు వచ్చాం? వచ్చింది తిరిగి వెళ్లి పోవటానికే నా? అలా అయినప్పుడు ఎందుకు రావాలి? అక్కడే ఉండొచ్చు కదా!? 


పరమాత్మ అయిన అరుట్పెరుం జ్యోతి తానే సర్వ సృష్టి అయి అంతటా తానే ఉంటున్నప్పుడు, మరి ఇక్కడ ఎవరు వెళ్లి ఎవరితో అంతర్లీనమై పోవాలి?


మోక్ష సాధనను ప్రస్తావించినప్పుడు, సహజంగా మహా శూన్యం లో నుంచి సకల సృష్ఠి ఆవిర్భవించిందని, తిరిగి మనం అక్కడికి చేరుకోవాలని చెప్తుంటారు. కానీ అక్కడి నుంచి వచ్చింది తిరిగి అక్కడికి వెళ్లి పోవడానికి కాదు. మోక్ష స్థితిలో జరిగేది ఇదే, సమాధి స్థితిలో, ఆ పరమాత్మ లో తమను అంతర్లీనం చేసుకొని ఆ శర్వానంద పారవశ్యం లో వేల కోట్ల సంవత్సరాలు, యుగాలు, కల్పాలు ఉండి పోతారు. కానీ, ఇది సంపూర్ణం కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా అద్వైత స్థితి లోకి చేరుకోలేదు కనుక. మోక్షం లో ఆత్మని పరమాత్మ తో అంతర్లీనం చేస్తాం కానీ, శరీరాన్ని నేను కాదు అనే భావన లో ఇంకా ద్వైత స్థితి లోనే ఉంచుతున్నాం. అంటే ఇక్కడ నేను వేరు శరీరం వేరు అన్న ద్వైత సిద్ధాంతం ఇంకా మనలో ఉంది. అందుకే శరీరాన్ని నేను కాదు అని దాన్ని వదిలేస్తున్నాం. అద్వైత స్థితిలో రెండో దానికి అవకాశం లేదు. అంతా ఒక్కటే. జడ పదార్థంగా ఉన్న ఈ శరీరం, అందులోని ప్రతి అణువు ఆత్మ శరీరం గా మారాలి. దీనిని వళ్లలార్ అనగ ఉడల్ అని అంటారు. శరీరమంతా ఆత్మ స్థితికి చేరుకొని, ఆకడి నుంచి పరమాత్మ స్థితిని పొందాలి.ఇదే దివ్యత్వ సిద్ధి. దీనిని సాధించటానికి, పూర్వ సాధనగా మొక్షముంది. అంటే మోక్షాన్ని దాటి దివ్యత్వం పొందాలి. ఇలా పొందినప్పుడు, ఇక పరమాత్మ లో అంతర్లీనమైపోవడం ఉండదు. నేను, పరమాత్మ వేరు కాదు అంతా ఒక్కటే అన్న అద్వైత స్థితిలో ఉండి, సకల సృష్టిలో active participation లో ఉంటాం. మహా శూన్యం లోనికి వెళ్లిపోతే ఈ active participation ఉండదు. మోక్షాన్ని పొంది, అక్కడికి వెళ్లి ఆ సర్వానందాన్ని అనుభవించి, తిరిగి రావాలి. ఈ అనంత సృష్టిలో ఆ పరమాత్మ పాత్ర ను పోషించాలి. ఎందుకంటే నేను పరమాత్మ వేరు కాదు కనుక. దీన్నే Heaven On Earth అని అంటారు. ఇగత్తే పరత్తై పెట్రు అని వళ్ళలార్ అంటారు. అంటే ఇక్కడ మనం ఉన్న ఈ భూమినే శ్వర్గతుల్యం చేసుకోవాలి అని.


ఇవన్నీ జరగడానికి కేవలం జీవకారుణ్యం ఎలా సరిపోతుంది?


మోక్షాన్ని పొందడం అంటే ఆ మహా శూన్యంలోకి ప్రవేశించాలి కదా! ప్రవేశించి, అరుట్పెరుం జ్యోతిని దర్శించి, శశ్శరీరంగా దివ్యత్వాన్ని పొంది తిరిగి రావాలి. ఇక్కడ మహా శూన్యం అంటే పరమాత్మ చిదానంద నాట్యం చేస్తున్న చిదాకాశమే. ఇక్కడ మన ఆత్మయే మనలో ఉన్న చిదాకశం. మన ఆత్మ లో ఉన్న పరమాత్మను చేరుకోవాలి. అందుకు ఆత్మలోనికి ప్రవేశించాలి. మరి ఆత్మాలోనికి ఎలా ప్రవేశించాలి?


ఈ అనంత సృష్టిలోనికెల్లా అతి చిన్న ద్వారం ఒకటి ఉంది. అది స్థూల, సూక్ష్మ చక్షువులకు కూడా కనిపించదు. అదే అత్మలోనికి ప్రవేశించే ద్వారం. ఆ ద్వారం లోనికి ప్రవేశించడానికి, మన sense అంత sharp అవ్వాలి. ఇప్పుడు మన sense మందంగా ఉంది. దీన్ని sharp చేయాలి. పరిణామంలో ఒక్కొక్క sense మనకు లభిస్తూ వస్తోంది, మానవ శరీరంలో మనం ఇప్పుడు 6th sense lo ఉంటున్నాం. అది కూడా సంపూర్ణంగా ఉపయోగించడం లేదు. ఇలా మన sense ని ఇంకా పెంచుకుంటూ, వాటిని పదునుపెట్టి, ఆత్మలోని అతి చిన్న ద్వారం లోనికి ప్రవేశించగలిగే సామర్థ్యాన్ని సాధించాలి. ఇదే మనం చేయవలసిన సాధన. 


ఆత్మలొనికి ప్రవేశించడానికి, జీవకారుణ్యం ఏ విధంగా తోడ్పడుతుంది?


జీవకారుణ్యం చేస్తున్న కొద్దీ, అతి మందంగా ఉన్న మన senses, ఇతర జీవుల మీద మనం చూపించే, దయ, ప్రేమలతో కరిగి, తద్వారా మన ఆత్మ ద్రవిస్తుంది. దీన్ని melting of the soul అని అంటాం. ఇలా ఆత్మ ద్రవించి జీవకారుణ్యం కాస్తా ఆత్మ బంధుత్వంగా మారుతుంది. ఇలా జరిగినప్పుడు, మన శరీరంలో శుద్ధ ఉష్ణం ఏర్పడి, తద్వారా, మన senses ని మరింత పదును చేసి, ఆత్మాలోనికి ప్రవేశించడానికి సాహాయపడుతుంది.


ఇలా మనం ఆ చిదాకాశ ద్వారంలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న అరుట్పెరుం జ్యోతిని దర్శించినప్పుడు, ఆ అరుట్పెరుం జ్యోతి మన శరీరం, మనస్సు, బుద్ధి, జీవం అంతా కూడా నిండిపోయి,  తానే అంతా అయిన అద్వైత స్థితికి, 100% చైతన్య స్థితికి మనల్ని చేరుస్తుంది. 


కనుక మన sense ని పదును పెట్టడమే ఇక్కడ మనకున్న సాధన. ఇది కేవలం జీవకారుణ్యం వల్లనే సాధ్యవుతుంది. ఇంక ఎన్ని యోగములు, తపస్సులు చేసినా కూడా, అది ఒక స్థాయి వరకే పరిమితమై ఉంది. సర్వ సిద్ధి పొందటానికి, దివ్యత్వాన్ని పొందటానికి  జీవకారుణ్యమే ఏకైక మార్గం.


లోకా సమస్తా సుఖినోభవంతు🙏🙏

అరుట్పెరుం జ్యోతి🙏🙏

తిరు ఆరుట్పా

ఓ ప్రజలారా! అజ్ఞానముతో మీరు జనన మరణ చక్రములో చిక్కుకొని, పరమానందమును గ్రహింపకున్నారు.
మీరు మోసము మరియు వివాదములను తెలుసుకొని ఉన్నారు కానీ పవిత్రతను తెలుసుకొనలేక పోయిరి.
ఇహ, పరములను గ్రహించకుంటిరి. ఏమి మీ వైఖరి?
మరణము వచ్చినపుడు మీరు ఏమి చేయుదురు? ఎక్కడ తలదాచుకొందురు మీరు? అయ్యో!!
మీ సూక్ష్మ దేహమును తెలుసుకొనక ఉన్నారు, ఆ దివ్య దేహమును తెలుసుకొని అంతము లేని జ్ఞాన 
అమృత దేహమును పొందగలరు. 
నన్ను ఎరుగని వారి వలె ఉంటిరి. నన్ను గుర్తుపట్టకున్నారా? 
ముక్తి పొందిన వారు అందరూ ప్రశంసించు ఆ పరమాత్ముని కుమారుడను నేను. 
                                                                    - వాళ్ళలార్ శ్రీ జ్యోతి రామలింగ స్వామి