మానవ జన్మ దైవత్వమును పొందుటకొరకే అని మనము గ్రహించవలెను.
సృష్టి ప్రారంభమునుండి ఒక జ్ఞానము గల ప్రాణి నుండి ఇప్పుడు ఆరు జ్ఞానములు అనగా ఆరవ జ్ఞానమగు ఆలోచనా జ్ఞానము గల ప్రాణి వరకు పరిణతి చెంది ఉన్నాము.
అతి సమీప సమయములో అనగా 19 వ శతాబ్దములో తమిళనాడులోని చిదంబరమునకు సమీపములో వడలూరు అను దివ్య క్షేత్రములో శ్రీ జ్యోతి రామలింగ స్వామి మరణమును జయించి త్రిదేహ సిద్ధి అనగా, శుద్ధ, ప్రణవ, జ్ఞాన జ్యోతి దేహములు పొంది, అమరత్వము అందరికీ సాధ్యమే అని చెప్పినారు. మానవులందరికీ ఇది సాధ్యమే అని నిరూపించినారు.
శ్రీ రామలింగ స్వామి
సృష్టి ప్రారంభమునుండి ఒక జ్ఞానము గల ప్రాణి నుండి ఇప్పుడు ఆరు జ్ఞానములు అనగా ఆరవ జ్ఞానమగు ఆలోచనా జ్ఞానము గల ప్రాణి వరకు పరిణతి చెంది ఉన్నాము.
ఈ పరిణామక్రమములో ఇంకనూ పైకెదిగి దైవత్వమును పొందవలెను. ఇప్పటి వరకూ ఈ పరిణామ క్రియను ప్రకృతి తానే స్వయముగా చేయుచూ వచ్చుచున్నది. పరిణామక్రమములో పై మెట్టు ఎక్కి పరిపూర్ణత చెందవలెను. ఈ బాధ్యత ప్రకృతి మనకు అప్పగించినది. మానవునికి సర్వ స్వతంత్రమును ప్రసాదించి పరిణామములో ఉన్నత శిఖరాలను అధిరోహించుట లేక ఇక్కడే ఉండిపోవుట, లేదా ఇంకను పాప కార్యములు చేసి నీచ స్థితులకు పోవుట మన చేతిలో ఉన్నది.
పరిణామక్రమములో ఉన్నత స్థితులకు వెళ్ళడం అనగా, దైవత్వమును పొందడమే! అనగా, దైవానికి మరణము లేదు. దైవత్వమును పొందినచో మనమూ మరణమును జయించి చిరంజీవులుగా జీవించగలము. ఇది సాధ్యమేనని ఎందరో మహానుభావులు, దివ్య పురుషులు ఇదివరకే రుజువు చేసి ఉన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు. మహావతార్ బాబాజీ రెండు వేల సంవత్సరములుగా హిమాలయములలో ఉన్నారు. ఆయన దర్శనం పొందిన ఆయన శిష్యులు ఎందరో వారి అనుభవములను పంచుకుంటున్నారు. తమిళనాడు లోని సిద్ధపురుషులు ఈ అమరత్వమును గురించి వివరించి ఉన్నారు. ఇవి వారి గ్రంథముల నుండి మనకు తెలియుచున్నది. ఈ అమరత్వ విద్య ప్రస్థావన మన వేదము, ఉపనిషత్తులలో కూడా ఉన్నది. ముఖ్యముగా కటోపనిషత్తులో ఈ విద్యను గురించి దీర్ఘముగా చర్చించబడి ఉన్నది. చీనా దేశమునకు చెందిన తావోలు కూడా ఈ అమరత్వమును గురించి ప్రస్థావించి ఉన్నారు.
శ్రీ రామలింగ స్వామి
No comments:
Post a Comment